మరోసారి ఢిల్లీకి వెళ్తున్న జగన్.. రేపు రాత్రికి అక్కడే బస!

  • రేపు ఢిల్లీకి బయల్దేరుతున్న జగన్
  • ప్రధాని మోదీని కలవనున్న సీఎం
  • ఎల్లుండి జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సుకి హాజరు 
ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. రేపు ఆయన ఢిల్లీకి బయల్దేరుతున్నారు. రేపు రాత్రికి అక్కడే బసచేయనున్న సీఎం... 30వ తేదీన జరగనున్న జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొననున్నారు. 

ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకాబోతున్నారు. అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. న్యాయ, కేసుల సత్వర పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. 

మరోవైపు ప్రధాని మోదీతో జగన్ వ్యక్తిగతంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఏ అంశాలపై చర్చించబోతున్నారనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. విశాఖ పాలనా రాజధాని అంశాన్ని జగన్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Jagan
YSRCP
Delhi
Narendra Modi
BJP

More Telugu News